జాతీయ వార్తలు

ఎల్‌ఓసి వద్ద మళ్లీ పాక్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఆగస్టు 13: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గత ఇరవై నాలుగు గంటల్లో పాక్ కాల్పులకు తెగబడడం ఇది మూడోసారి. పూంచ్ జిల్లా మన్‌కోటే సెక్టార్‌లో ఆదివారం ఉదయం పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయని, అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. శనివారంనాడు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాల కాల్పుల్లో మృతిచెందిన మహిళను రఖియాబీగా గుర్తించినట్టు జూనియర్ కమిషనర్ ఆఫీసర్ (జెసిఓ) నరుూబ్ సుబేదర్ జగ్రామ్‌సింగ్ తెలిపారు. అది కూడా పూంచ్ జిల్లాలోనే చోటుచేసుకుందని ఆయన అన్నారు. ఈ నెల 8న పాక్ సైనికుల కాల్పుల్లో పవన్ సింగ్ సుగ్రా (21) మృతి చెందినట్టు జెసిఓ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 285 కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరిగాయి.