జాతీయ వార్తలు

ఉత్తమ సేవలందించిన 13మంది పోలీసులకు కేంద్ర పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన తెలంగాణ పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. తెలంగాణ పోలీసులకు మొత్తం 13 పతకాలు దక్కాయి. రాష్టప్రతి విశిష్ట సేవా పతకాలను తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న సి.వి అనంద్ (ఐపిఎస్), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ డిసిపి బాలకృష్ణ దక్కించుకున్నారు. అలాగే అత్యుత్తమ సేవా పతకాలను చిక్కడపల్లి ఎసిపి జోగుల నరసయ్య, మహబూబ్‌నగర్ డిసిపి ఎం.ప్రభాకర్, హైదరాబాద్ సిటీ టీఆర్‌జీ సెంటర్ ఎసిపి పకగిరి రాజు, హైదరాబాద్ ఇంటెలిజెన్సు సిఐ విభాగంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ తుళ్లూరి రాజా రాజేశ్వర్ లక్ష్మి, హైదరాబాద్ రీజనల్ డిప్యూటీ అసాల్ట్ కమిషనర్ పి.్భపాల్ రెడ్డి, వరంగల్ జిల్లా ఖాజీపేట్ స్టేషన్ ఎఎస్‌ఐ బురుగుల మహేందర్, కరీంనగర్ టిఎస్‌ఎస్‌పి 7వ బెటాలియన్ ఎఆర్‌ఎస్‌ఐ టి.ప్రభాకర్, హైదరాబాద్ ఇంటెలిజెన్సు హెడ్ కానిస్టేబుల్ ముద్దం రఘుపతి రావు, అంబర్‌పేట్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ కరీమొద్దీన్, తెలంగాణ ఎస్‌ఐబి ఇంటెలిజెన్సు కార్యాలయంలో పనిచేస్తున్న హైదరాబాద్ డిఎఎస్‌పి ఆర్.జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఐజీపీ ఇంటెలిజెన్సు కార్యాలయంలోని హెడ్ కానిస్టేబుల్ పి.జీవానందం పతకాలు దక్కించుకున్న వారిలో ఉన్నారు.