జాతీయ వార్తలు

లోతుగా చర్చిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్ము- కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, పౌర హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 35ఎ ఆర్టికల్‌పై విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు సుముఖత చూపించటం సంచలనమైం ది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఎ, జము-కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆరో సెక్షన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారిస్తుండటం తెలిసిందే. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు వీల్లేదంటూ జమ్ము-కాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు గొడవ చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పంచటం, బయటి రాష్ట్రాలవారిని వివాహమాడే యువతులు స్థానికంగా ఆస్తి హక్కు కోల్పోవటం, పౌరులకు శాశ్వత నివాస హక్కు, బయటి రాష్ట్రాలవారు జమ్ము-కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేయకుండా నిషేధించటం తదితర అంశాలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ అంశాలన్నింటినీ లోతుగా పరిశీలించి తగు తీర్పు ఇచ్చేందుకు ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు సోమవారం సూచనప్రాయంగా తెలిపింది. అయితే, సుప్రీం ఆలోచన రాష్ట్రంలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంటున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాష్ట్రంలోని పరిస్థితులను అదుపుచేయటం కష్టమేనంటున్నారు. ఇదే విషయాన్ని పిడిపి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వ సిఎం మెహబూబా ముఫ్తీ సైతం మాట్లాడటం తెలిసిందే. గతవారం ఢిల్లీకి వచ్చిన ముఫ్తీ, ప్రధాని మోదీతో ఈ అంశంపై ప్రత్యేక చర్చలు జరిపారు. జమ్ము-కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదని ప్రధాని భరోసా ఇచ్చినట్టు మీడియా వద్ద ప్రకటించారు. అయితే, ముఫ్తీ ప్రధానిని కలిసిన తరువాతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సముఖత చూపించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.