జాతీయ వార్తలు

జమ్ములో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సరిహద్దు పోలీస్ పోస్టుల దగ్గర నిఘా పెంచారు. చొరబాట్లు జరుగుతాయని అనుమానం ఉన్న అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు 24గంటలూ అందుబాటులోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదుల చొరబాట్లు జరగకుండా ఉండేందుకు అన్ని విధాలైన భద్రతా ఏర్పాట్లు జరగాలని ప్రభుత్వ ఆదేశించింది. దక్షిణ కాశ్మీర్‌లో హిజ్బుల్ కమాండర్ ఘజ్నవిని హతమార్చిన నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కుప్వారా జిల్లాలో ఇద్దరు హర్కత్ ఉల్ ముజాహిదీన్ మిలిటెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం ప్రకారం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బకిహకెర్ క్రాసింగ్ దగ్గరి చెక్‌పోస్ట్ దగ్గర ఈ ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు ప్రకటించారు. వీరిద్దరిలో ఒకరు అహ్మద్ మిర్ (19) బద్గాం జిల్లాకు, మరో టెర్రరిస్ట్ తాహిర్ ఉల్ ఇస్లామ్ (21) శ్రీనగర్ జిల్లాకు చెందినవాడు. జమ్ము కాశ్మీర్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కంటింజెంట్ పాల్గొంటోంది. శ్రీనగర్‌లో జరిగే పరేడ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేదాన్‌సింగ్ నాయకత్వం వహిస్తారు.