జాతీయ వార్తలు

శిశు మరణాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సి సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో నాలుగైదు రోజుల వ్యవధిలో 60 మందికిపైగా చిన్నారులు మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. బాధిత కుటుంబాల సహాయ, పునరావాసానికి తీసుకున్న చర్యలను, అలాగే తప్పు చేసిన అధికారులపై తీసుకున్న చర్యలను కూడా తెలియజేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆ నోటీసులో ఆదేశించింది. లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే కంపెనీకి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ఆక్సిజన్ సరఫరాను నిలిపి వేయడంతో ఆస్పత్రిలో ఈ నెల 7నుంచి 60 మందికి పైగా చిన్నారులు చనిపోవడం తెలిసిందే. దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సూమోటోగా పరిగణనలోకి తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్‌సి యుపి ప్రభుత్వానికి ఈ నోటీసులు పంపించింది. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత పెద్దఎత్తున శిశు మరణాలు సంభవించడం అంటే ప్రజలకున్న జీవించే హక్కు, ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని కమిషన్ అభిప్రాయపడింది. అంతేకాక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఆస్పత్రి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. ఇంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్ ఆస్పత్రుల్లో మెదడువాపు వ్యాధి కారణంగా మరణాలు సంభవించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని కమిషన్ పేర్కొంది. లక్నోలో ఇటీవల కమిషన్ జరిపిన బహిరంగ విచారణ సందర్భంగా ఈ సమస్యను ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో కూలంకషంగా చర్చించడం జరిగిందని కమిషన్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు కేసులకు సంబంధించి ఈ నెల 9-11 తేదీల మధ్య ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని కమిషన్ వ్యాఖ్యానించింది.

చిత్రం.. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు