జాతీయ వార్తలు

హిజ్బుల్ కొత్త కమాండర్‌గా కాసిమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 14: జమ్మూ, కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఫీల్డ్ ఆపరేషనల్ కమాండర్ యాసీన్ యట్టూ అలియాస్ ఘజ్నవి స్థానంలో మహమ్మద్ బిన్ కాసిమ్‌ను నియమించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ తెలియజేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో సయ్యద్ సలాహుద్దీన్ అధ్యక్షతన జరిగిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండ్ కౌన్సిల్ సమావేశంలో కాసిమ్‌ను కాశ్మీర్‌లో హిజ్బుల్‌కు కొత్త కమాండర్‌గా నియమించినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలియజేశారు. శనివారం రాత్రి దక్షిణ కాశ్మీర్‌లోని షోయాన్ జిల్లా ఆనిరా గ్రామం వద్ద భద్రతా దళాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో యట్టూ అలియాస్ ఘజ్నవి, అతని అనుచరులు ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, సోమవారం పాక్ సైన్యాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తంగ్‌ధార్ సెక్టార్‌లో అధీన రేఖ వెంబడి రెండుచోట్ల భారత సైనిక శిబిరాలు లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో మొదలైన ఈ కాల్పులు గంటసేపు కొనసాగాయ. అయతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చిత్రం.. భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్‌బుల్ ముజాహిద్దీన్ కమాండర్ యాసిన్ యట్టూ అంతిమ సంస్కరణలకు భారీగా తరలివచ్చిన స్థానికులు