జాతీయ వార్తలు

ఆ దారి ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఆగస్టు 14: కొండచరియలు విరిగిపడి రెండు బస్సుల్లో దాదాపు 50మంది ప్రయాణికులు మృతిచెందిన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి-పఠాన్‌కోట్ రహదారిని ప్రమాదకరమైన దారిగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవాలని సూచించింది. బండరాళ్ల మధ్య బస్సులు చిక్కుకుపోయిన ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సిమ్లా జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న 65 రహదారులపై హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ బస్సులను నిలిపివేసింది. ఆదివారం వచ్చిన విపత్తులో రెండు బస్సులు బండరాళ్ల కింద పడి నుజ్జు నుజ్జయ్యాయని రెవిన్యూ విభాగం ప్రత్యేక కార్యదర్శి డిడి శర్మ అన్నారు. కొండ చరియలు విరిగి పడటానికి కారణాలను భౌగోళిక శాస్తవ్రేత్తలు పరిశోధన చేస్తారని, మంగళవారం ఒక బృందం ఈ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తాయన్నారు. మొత్తం 23 మృతదేహాలలో నాలుగింటిని ఫోరెన్సిక్ విభాగం గుర్తించిందని, మిగతా 19 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను ఐఐటి కామంద్ మీదుగా మళ్లించినట్లు పేర్కొన్నారు. మండి- ఆట్, చండీగఢ్-మనాలీ రోడ్లను మండి జిల్లా యంత్రాంగం మూసివేసింది.
ఈ రెండు దారులకు ప్రత్యామ్నాయంగా మండి-కులూ రోడ్డును వయా కోట్ల మీదుగా ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదివారం ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే.