జాతీయ వార్తలు

కార్తీ చిదంబరానికి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సోమవారం సుప్రీం కోర్టు గట్టిషాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ సిబిఐ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. దీంతో ఆయనపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేయగా మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు స్టే రద్దయింది. విదేశీ పర్యటనలకు వెళ్లొందంటూ చిదంబరం కుమారుడిని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్, జస్టిస్ డివై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు స్టేను రద్దుచేసిన ధర్మాసనం సిబిఐ విచారణకు హాజరుకావల్సిందిగా కార్తీకి నోటీసులు జారీ చేసింది. ఫారెన్ ఇన్విస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు నుంచి ఐఎన్‌ఎక్స్ మీడియాకు నిధులు సమకూర్చే విషయంలో అక్రమాలు జరిగాయన్నది అభియోగం. కార్తీ తండ్రి పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఇది చోటుచేసుకుంది. అలాగే ఎఫ్‌డిఐ నిబంధనలు ఉల్లంఘన జరిగిందని సిబిఐ స్పష్టం చేసింది. దీనిపై మే 15 సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మే 16 నుంచి కార్తీ చిదంబరం, ఆయన స్నేహితుల ఇళ్లు, నివాసాలపై సిబిఐ సోదాలు జరిపింది. మే 18, 21 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సిబిఐ ఆదేశించినా, కార్తీ బేఖాతరు చేశారు. దీంతో విదేశాలకు వెళ్లిపోకుండా ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మద్రాస్ హైకోర్టు స్టేను రద్దుచేసిన సుప్రీం కోర్టు విదేశీ పర్యటనలకు వెళ్లొద్దంటూ కార్తీ చిదంబరాన్ని ఆదేశించింది.