జాతీయ వార్తలు

21మందిపై నితీశ్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 14: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసమ్మతి వర్గంపై వేటు వేశారు. సీనియర్ నేత శరద్‌యాదవ్ అనుచరులుగా భావిస్తున్న 21 మంది నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహాకూటమిని విచ్ఛిన్నం చేసి బిజెపితో జతకడుతూ నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 21 మంది ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జెడి(యు) బిహార్ అధ్యక్షుడు వశిష్ఠ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారిలో మాజీ మంత్రి రమయి రామ్, మాజీ ఎంపి షెవ్‌హర్ అర్జున్ రాయ్, మాజీ ఎమ్మెల్యే రాజ్‌కిశోర్ సిన్హా, మాజీ ఎమ్మెల్సీ విజయ్ వర్మ ఉన్నారు. వీరితోపాటు కొందరు జిల్లాస్థాయి నేతలను కూడా సస్పెండ్ చేస్తున్నారు. రమయ్‌రామ్, అర్జున్ రాయ్ శరద్‌యాదవ్‌కు అత్యంత సన్నిహితులు. శరద్ మూడు రోజులపాటు నిర్వహించిన సంవాద్ యాత్రలో వీరిద్దరూ చురుకుగా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ అలీ అన్వర్‌ను కూడా పార్టీ సస్పెండ్ చేసింది.