జాతీయ వార్తలు

అంతర్గత శక్తులే సమాజాన్ని చీలుస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: చైనా, పాకిస్తాన్‌ను నుంచే ఎదురయ్యే సవాళ్లను భారత్ ఎదుర్కొంటుందని, అయితే అంతర్గతంగా కొన్ని శక్తులు సమాజాన్ని ముక్కలు చేస్తున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ ఆయన ప్రస్తావించలేదు. జెడి(యు) నేత శరద్ యాదవ్ గురువారం ఇక్కడ నిర్వహించిన ‘వారసత్వ పరిరక్షణ’ సమావేశంలో ఫరూఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చైనా, పాకిస్తాన్‌ను మనం ఏ విధంగానైనా ఎదుర్కోవచ్చు.. అయితే దేశం లోపలే దొంగలున్నారు.. వారు సమాజాన్ని పాడుచేస్తున్నారు’ అని ఫరూఖ్ పేర్కొన్నారు. ‘కొంతమంది కాశ్మీరీల జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించే అధికారం వారికి ఎక్కడిది’ అని నిలదీశారు. కాశ్మీరీలందరూ భారత్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారని, ఎందుకంటే ఇక్కడ అందరికీ సమాన హక్కులున్నాయని అన్నారు. ఒక ఇండియన్ ముస్లింగా చెప్పుకోవడానికి తానేప్పుడు గర్వపడతానని అన్నారు. ‘దేశంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని వాళ్లు చెబుతారు, కాని ఆ అశకావాన్ని వాళ్లే చెడగొడుతున్నారు’ అని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కాశ్మీర్ ప్రజల గురించి ఎటువంటి హామీలు ఇవ్వలేదని, అంతటి విశాల హృదయం వారికుందని తాను అనుకోవడం లేదని అన్నారు.