జాతీయ వార్తలు

ఇన్ఫోసిస్‌లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని నెలలుగా ఇన్ఫోసిస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు శుక్రవారం ఆకస్మిక మలుపు తిరిగాయి. నారాయణ మూర్తి సారథ్యంలోని కీలక వ్యక్తుల కూటమితో వివాదాలమయంగా మారిన పరిస్థితులను తట్టుకోలేక విశాల్ సిక్కా సంచలన రీతిలో రాజీనామా చేశారు. ఈ పరిణామం పది మిలియన్ డాలర్ల ఇన్ఫోసిస్ కంపెనీని కుదిపేసింది. దీని ఫలితంగా దాదాపు 25వేల కోట్లమేర ఈ ఐటి సంస్థ ఒక్కరోజులోనే నష్టపోయింది. నారాయణ మూర్తి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా తరిగిపోయాయి. 2014 ఆగస్టులో ఐదేళ్ల పదవీకాలంతో ఇన్ఫోసిస్‌లో చేరిన సిక్కా తీవ్రస్థాయిలోనే సంస్థాపకులపై ధ్వజమెత్తారు. తనపై వ్యక్తిగత దాడులకు దిగారన్న దుష్ప్రచారమూ జరిగిందంటూ ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ బోర్డు కూడా సిక్కా రాజీనామకు నారాయణ మూర్తే కారణమంటూ అధికారికంగా ఓ ప్రకటన జారీ చేయడం ఈ వ్యవహారాన్ని పరాకాష్టకు చేర్చింది. బోర్డు మద్దతు బలంగా ఉన్నప్పటికీ విశాల్ సిక్కా రాజీనామాకు నారాయణ మూర్తి ధోరణే కారణమంటూ స్పష్టం చేయడం కలకలం రేపింది.