జాతీయ వార్తలు

ఢిల్లీ హోటల్లో కీచకపర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటటల్‌లో మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటుగా ఆమె చీరలాగి వివస్తన్రు చేయడానికి యత్నించిన సెక్యూరిటీ మేనేజర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట చేశారు. ఈ సంఘటనపై బాధితురాలు గత నెల 30నే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన సిసిటీవీ దృశ్యాలు శుక్రవారం టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో పోలీసులు సెక్యూరిటీ మేనేజర్‌ను అరెస్టు చేశారు. నిందితుడ్ని ప్రశ్నించడంతో పాటుగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను తీసుకున్న తర్వాత ప్రాథమికంగా నిందితుడు తప్పు చేసినట్లు భావించడంతో అతడ్ని అరెస్టు చేయడం జరిగిందని, తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసు ముఖ్య అధికార ప్రతినిధి దీపేంద్ర పాఠక్ చెప్పారు. కాగా, సెక్యూరిటీ మేనేజర్ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ కొంతకాలంగా తనను ఒత్తిడి చేస్తున్నాడని, అయితే తాను ప్రతిఘటిస్తూ వస్తున్నానని బాధితురాలు తెలిపింది. జూలై 29న తన పుట్టిన రోజని, ఆ రోజున సెక్యూరిటీ మేనేజర్ తనను తన రూమ్‌లో బర్త్‌డే పార్టీ కోసం పిలిచాడని, గిఫ్ట్‌లు కూడా ఇవ్వజూపాడని, ఆ తర్వాత తన చీర లాగడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది. అయితే తాను విడిపించుకొని హోటల్ హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశానని, అయితే సెక్యూరిటీ మేనేజర్‌పై చర్య తీసుకోవడానికి బదులు తననే ఉద్యోగంనుంచి మేనేజిమెంట్ తొలగించిందని ఆమె వాపోయింది. అనంతరం తన భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత స్టేట్‌మెంట్ నమోదు చేసుకొని ఆమె ఇచ్చిన సాక్ష్యాధారాలను, సిసి టీవీ దృశ్యాలను క్రాస్ చెక్ చేయడం జరిగిందని పాఠక్ చెప్పారు. అయితే పోలీసు విచారణలో నిందితుడు బాధితురాలిపైనే ప్రత్యారోపణలు చేసినట్లు చెప్తున్నారు.