జాతీయ వార్తలు

యోగి సర్కార్‌కు హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 18: గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దాఖలయిన ఒక ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై పూర్తి వివరాలతో ఒక కౌంటర్ అఫిడవిట్‌ను ఆరువారాల్లోగా దాఖలు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ జనరల్‌ను శుక్రవారం ఆదేశించింది. అనంతరం హైకోర్టు లక్నో బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. సామాజిక కార్యకర్త నూతన్ ఠాకుర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆమెతో పాటుగా అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, వైద్య విద్యా శాఖ తరఫున్యాయవాది సంజయ్ భాసిన్‌ల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, దయాశంకర్ తివారీలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్‌ను వ్యతిరేకించిన అడ్వకేట్ జనరల్ ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వీలయిన అన్ని చర్యలను తీసుకొందని, చీఫ్ సెక్రటరీ సమర్పించిన నివేదిక ప్రకారం అన్ని చర్యలు తీసుకొంటుందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు వాస్తవాలను దాచిపెట్టడానికి, దోషులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నదనే సందేశాన్ని ఇస్తున్నాయని నూతన్ ఠాకుర్ వాదించారు. ఈ నెల 7వ తేదీనుంచి గురువారం దాకా గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి ఆస్పత్రిలో మెదడువాపువ్యాధి సహా వివిధ కారణాలపై మృతి చెందిన చిన్నారుల సంఖ్య 71కి చేరుకొంది. ఈ మరణాల్లో కొన్ని ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించాయనే ఆరోపణలున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ ఈ ఆరోపణలను కొట్టివేసింది.