జాతీయ వార్తలు

‘ఉత్కళ్’పై రైల్వే కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌నగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి బాధ్యులపై చర్యలు చేపట్టింది. కార్యదర్శి స్థాయి రైల్వే బోర్డు అధికారి సహా ముగ్గురు ఉన్నతాధికారులను సెలవుపై పంపించింది. నలుగురిని సస్పెండ్ చేసింది. మరొకరిని బదిలీ చేసింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్న ప్రాథమిక దర్యాప్తు నివేదిక నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. రైల్వే బోర్డు ట్రాఫిక్ విభాగం సభ్యుడు మహ్మద్ జంషెడ్ అందించిన నివేదిక ఆధారంగా మొత్తం 8మందిపై చర్యలు తీసుకుంది. రైల్వే బోర్డు ఇంజనీరింగ్ విభాగం సభ్యుడు ఆదిత్యకుమార్ మిట్టల్, ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ ఆర్కె కులశ్రేష్ట, డివిజినల్ రైల్వే మేనేజర్(్ఢల్లీ) ఆర్ ఎన్ సింగ్‌లను సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.