జాతీయ వార్తలు

భోజన పథకాలను ఎలా పర్యవేక్షిస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును, పరిశుభ్రతను ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ పథకం అమలులో పరిశుభ్రతతోపాటు ఇతర అంశాలను పర్యవేక్షించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రెండు కమిటీలను నియమించాల్సిన అవసరం ఉందన్న సూచనను పరిగణనలోకి తీసుకుని చీఫ్ జస్టిస్ జెఎస్.ఖేహర్, జస్టిస్ డివై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వివరణ కోరింది. ‘మధ్యాహ్న భోజన పథకం అమలు ఏవిధంగా సాగుతోందో మాకు వివరించండి. ఆ తర్వాత తగిన ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ పథకాన్ని పటిష్టవంతం చేస్తాం’ అని ధర్మాసనం పేర్కొంటూ, ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. మధ్యాహ్న భోజన పథకంపై అంతర్ రాష్ట్రీయ మానవ్ అధికార్ నిగ్రాణీ అనే ఎన్‌జిఓ 2013లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పై ఆదేశాలను జారీ చేసింది.