జాతీయ వార్తలు

రైళ్ల రాకపోకల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉత్తర రైల్వే ఖతౌలీ మార్గంలో సోమవారం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. శనివారం సాయంత్రం ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాల తప్పడంతో 22 మంది మృతి చెందారు. కనీసం 156 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రైల్లోని 13 బోగీలు పట్టాల తప్పడంతో మీరట్-ముజాఫర్‌నగర్-సహారన్‌పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల తరువాత సోమవారం తెల్లవారుజాము ఒకటిన్నర ప్రాంతంలో 545442 అంబాలా మీరట్ సిటీ ప్యాసింజర్ సర్వీసును మొదటిగా ప్రారంభించినట్టు ఉత్తర రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైల్వే శాఖ నలుగురు ఉన్నత అధికారులపై వేటు వేసింది. కార్యదర్శి స్థాయి రైల్వే బోర్డు సభ్యుడితోపాటు ముగ్గురి ఉన్నతాధికారులను సెలవుపై పంపారు. నలుగురిని సస్పెండ్ చేశారు. ట్రాక్ ఇంజనీర్‌పై బదిలీ వేటు వేసింది. అలాగే రైల్వే బోర్డు (ఇంజనీరింగ్) సభ్యుడు, ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్, డివిజనల్ రీజనల్ మేనేజర్(్ఢల్లీ)లను సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. రైల్వే భద్రతా కమిషనర్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.