జాతీయ వార్తలు

2000నగదు అంగీకారమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజకీయ పార్టీలకు వ్యక్తిగత విరాళాలు నగదు రూపంలో రూ.2000 మించి ఇవ్వరాదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మేరకు సరైనదని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయా పార్టీలను కమిటీ కోరింది. ‘ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు వ్యక్తిగత విరాళాల నగదు పరిమితి రూ.2000 విధించటం సరైనదేనా?’ అని ప్రశ్నావళిలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపు ఉంది. అయితే పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకతను పెంచేందుకు వ్యక్తిగత విరాళాలలను నగదు రూపంలో తీసుకునే పరిమితిని రూ.2000కు మించకుండా చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి చాలాసార్లు సిఫారసు చేసింది. 2017 ద్రవ్యబిల్లులో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పార్లమెంట్ ముందుంచింది. అయితే ఈ ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ అధ్యయనానికి లోక్‌సభ నివేదించింది. ఎన్నికల వ్యవస్థలో నల్లధనాన్ని నిరోధించటానికి ఈ చర్య తీసుకోవటం తప్పనిసరి అని ప్రభుత్వం చెప్తోంది. పార్టీలు తీసుకునే విరాళాలపై ఎలాంటి నిషేధం విధించకపోయినా అన్ని లావాదేవీలు చెక్కులు, లేదా డిజిటల్ రూపంలో జరగాలన్న నిబంధన విధించింది. రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చినప్పటికీ, రూ.20వేల పైచిలుకు విరాళాలు ఇచ్చే వ్యక్తుల, సంస్థలకు సంబంధించిన వివరాలు లిఖితపూర్వకంగా అందించాలని మెలిక పెట్టింది. దీంతో రాజకీయ పార్టీలన్నింటికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.