జాతీయ వార్తలు

దేశ పురోగతికి నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాఖ్ దురాచారాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఈ దేశం ఎంతగా పురోగమించిందో చెప్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను అన్ని వర్గాలు ఖండించిన దృష్ట్యా ఈ తీర్పు దేశానికి ఎన్నో ప్రయోజనాలను తీసుకువస్తుందని అన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి నేతృత్వంలో ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయ నిపుణుల బృందంలో పింకీ ఆనంద్ కూడా ఉన్నారు. ‘ఈ తీర్పు దేశానికి, దేశ ప్రజలకు ఎంతో మంచిని తీసుకువస్తుందని ఆశిస్తున్నాను.
మహిళలను కించపరిచే ఒక దుష్ట సంప్రదాయానికి వ్యతిరేకంగా మనం పోరాడగలిగాం’ అని ఆయన అన్నారు. ఈ దేశం, ఈ సమస్యతో సంబంధం ఉన్న భాగస్వాములు ఎంతగా పురోగతి చెందారో ఈ తీర్పు చెప్పకనే చెప్తోందని అన్నారు. సమాజంలోని దాదాపు అన్ని వర్గాలు ఖండించిన సంప్రదాయం ఇదని, అయితే దీన్ని ఎదుర్కోవాలంటే మన నాయకులు, దేశంలో వ్యవస్థలకు ఎంతో దూరదృష్టి అవసరమని ఆయన అన్నారు.