జాతీయ వార్తలు

గోరఖ్‌పూర్ ఘటనలో 9 మందిపై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 24: గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో 60 మంది చిన్నారుల మృతికి సంబంధించి తొమ్మిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బిఆర్‌డి మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌పైనా కేసు నమోదు చేశారు. అలాగే అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అనితా భట్నాగర్ జైన్‌పై బదిలీ వేటుపడింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలేక చిన్నారులు చనిపోయారు. మెస్సర్స్ పుష్పా సేల్స్ కంపెనీ యాజమానులపైనా కేసు నమోదైంది. ఆసుపత్రికి లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాల్సింది ఈ కంపెనీనే. గోరఖ్‌పూర్ విషాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి బుధవారం నివేదిక అందజేసింది. మెడికల్ కాలేజీకి గత మూడేళ్లలో కొనుగోలు చేసిన మందులకు సంబంధించి కాగ్‌తో ఆడిట్ నిర్వహించాలని సిఫార్సు చేసింది.