జాతీయ వార్తలు

సుప్రీం తీర్పునాడే ట్రిపుల్ తలాఖ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్/లక్నో, ఆగస్టు 24: ట్రిపుల్ తలాఖ్ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే యూపీలోని ఓ వ్యక్తి భార్యకు తలాఖ్ చెప్పాడు. గర్భవతి అని కూడా చూడకుండా తలాఖ్ పేరుతో విడాకులు ఇచ్చాడు. సర్వోన్నత న్యాయస్థానం తలాఖ్ చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో భర్తపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు మూహల్లా కమ్రా నవాబన్ ప్రాంతానికి చెందినది వారన్నారు. తన భర్త కట్నంకోసం చిత్రహింసలు పెట్టేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లల తల్లయిన ఆమె ఇప్పుడు గర్భిణి. వారిద్దరి మధ్య ఉన్న గొడవలకు సంబంధించి మంగళవారం నాడు ఆమె కుటుంబ సభ్యులు అల్లుడి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. అల్లుడి తీరుపై అత్తింటివారు తీవ్ర ఆవేదన చెందారు. ఇవేవీ పట్టించుకోని అతడు భార్యకు మూడుసార్లు తలాఖ్ చెప్పాడని పోలీసులు తెలిపారు. తలాఖ్ తప్పు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పినా అతడు వినిపించుకోలేదని బాధితురాలు వాపోయింది. కాగా భర్త, అతని బంధువులు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర సింగ్ చెప్పారు.