జాతీయ వార్తలు

గుజరాత్, కర్నాటకలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవటంతోపాటు కర్నాటకలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి అధినాయకత్వం సీనియర్ మంత్రులను రంగంలోకి దింపింది. గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్‌గా మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను నియమించిన బిజెపి అధినాయకత్వం హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలను సంక్షేమ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు అప్పగించింది. గుజరాత్ ఇంచార్జ్ అరుణ్ జైట్లీకి తోడ్పడేందుకు మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, నిర్మలా సీతారామన్, జితేంద్రసింగ్, పి.పి.చౌదరిలను సహఇంచార్జ్‌లుగా నియమించారు. ప్రకాశ్ జావడేకర్‌కు సహఇంచార్జ్‌గా ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రంగంలోకి దించారు.
సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వంలో నలుగురు మంత్రులను ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించటం చూస్తుంటే నరేంద్ర మోదీ, అమిత్ షా గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది స్పష్టమవుతోంది. గుజరాత్‌లో వరుసగా ఐదోసారి కూడా అధికారంలోకి రావాలనే పట్టుదలతోనే సీనియర్ మంత్రులను రంగంలోకి దించారని అంటున్నారు. గుజరాత్‌లో బాగా పలుకుబడి ఉన్న పటేల్ వర్గం ప్రజలు బిజెపిని వ్యతిరేకిస్తున్నారని వార్తలు రావటం తెలిసిందే. పటేల్ వర్గం రిజర్వేషన్లకోసం పెద్దఎత్తున ఉద్యమించటం వలన బిజెపికి నష్టం జరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఒక బలమైన వర్గం తమను వ్యతిరేకిస్తున్నందున అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని పదిలం చేసుకునేందుకే సీనియర్ మంత్రులను రంగంలోకి దించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌కు కేవలం ఒక మంత్రిని, కర్నాటక ఇంచార్జ్‌గా ఇద్దరు మంత్రులను మాత్రమే నియమించిన బిజెపి అధినాయకత్వం గుజరాత్‌కు మాత్రం ఒక సీనియర్ మంత్రి, మరో నలుగురు మంత్రులను ఇంచార్జ్‌గా నియమించటం ప్రాధాన్యతను సంతరించుకుంది.