జాతీయ వార్తలు

ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వం రంగ సంస్థ ఎయిర్ ఇండియాను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు రెచ్చించిన ఉత్సాహంతో పనిచేస్తానని సంస్థ తాత్కాలిక సిఎండి, సీనియర్ ఐఎఎస్ రాజీవ్ బన్సాల్ వెల్లడించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానని గురువారం బాధ్యతలు చేపట్టిన బన్సాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 50వేల కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోంది. సుదీర్ఘకాలం తరువాత 2015-16లో సంస్థ లాభాల్లో పడింది. ‘ప్రయాణికుల అభిమానాన్ని చూరగొనేలా కార్యాచరణ అమలుచేస్తాం. అలాగే నష్టాల బారినుంచి లాభాల్లోకి వచ్చేలా నూతనోత్సహాంతో పనిచేస్తాం’ అని తాత్కాలిక సిఎండిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘దీనికి దేశ ప్రజలు, ఎయిర్ ఇండియా ఉద్యోగుల సహకారం మాకు కావాలి’ అని ఆయన అన్నారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన అశ్వనీ లోహానీని రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమించడంతో ఆయన స్థానంలో బన్సాల్‌ను తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇంతకుముందు బన్సాల్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. బుధవారమే ఆయనను ఎయిర్ ఇండియా తాత్కాలిక సిఎండిగా నియమించారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖలో డైరెక్టర్‌గా పనిచేసిన బన్సాల్ నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఏసిఐఎల్) బోర్టు మెంబర్‌గా కీలకపాత్ర పోషించారు. నాగాలాండ్ కేడర్ ఐఎఎస్ అధికారి అయిన బన్సాల్ కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీగా సేవలందించారు. డిజిటల్ చెల్లింపులు, ఐటి చట్టం, ఆధార్, ఇంటర్నెట్ గవర్నెస్‌లో కీలకపాత్ర పోషించారు. 1986లో ఢిల్లీ ఐఐటి నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టాపొందారు. హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ నుంచి ఫైనాన్స్‌లో డిప్లోమా చేశారు. ఢిల్లీ ఐఐఎఫ్‌టిలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.