జాతీయ వార్తలు

గుర్మీత్‌కు జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 26: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా ఆశ్రమం చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే ఆయనకు ఉన్న జడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించడం జరిగిందని హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎస్ ధేసి శనివారం ఇక్కడ చెప్పారు. అంతేకాదు, రామ్ రషీమ్‌ను రోహ్టక్ జైల్లోప్రత్యేక వ్యక్తిగా చూస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. శుక్రవారం రామ్ రహీమ్‌ను అరెస్టు చేసిన క్షణంనుంచే ఆటోమేటిగ్గా ఆయనకున్న జడ్‌ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించడం జరిగిందని ధేసి విలేఖరులతో చెప్పారు. అంతేకాదు ఆయనను ఒక సాధారణ ఖైదీగానే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరి ఖైదీలకు ఇచ్చే ఆహారానే్న ఆయనకు కూడా ఇస్తున్నట్లు ధేసి చెప్పారు. రామ్ రషీమ్‌ను దోషిగా న్యాయమూర్తి ప్రకటించిన వెంటనే ఆయనను రోహ్టక్‌లోని సునారియా జైలుకు హెలికాప్టర్‌లో తరలించిన విషయం తెలిసిందే. కాగా, జైల్లో రామ్ రహీమ్‌కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని, మిగతా సాధారణ ఖైదీల్లాగే ఆయన కూడా నేలపైనే పడుకొంటున్నారని జైళ్ల శాఖ డిజిపి కెపి సింగ్ చెప్పారు. జైల్లో పేరుమోసిన ఖైదీలు ఉన్న కారణంగా భద్రతాపరంగా ఏమయినా సమస్యలు ఎదురుకానున్నాయా? అని విలేఖరులు అడగ్గా, అందుకోసమే తాము జైలులోపల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని, రామ్ రహీమ్ కార్యకలాపాలను గమనించడానికి ఆయననును ఉంచిన బ్యారక్ వద్ద నలుగురు సిబ్బందిని నియమించినట్లు డిజిపి చెప్పారు. అంతేకాదు జైలు వెలుపల సైతం అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కోరినట్లు ఆయన చెప్పారు.