జాతీయ వార్తలు

హింసను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27:మత విశ్వాసాల పేరిట ఎలాంటి హింసాకాండను సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. డేరా బాబా గుర్మీత్ సింగ్‌ను ఓ అత్యాచార కేసులో కోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో జరిగిన హింసాకాండను పరోక్షంగా ప్రస్తావించిన మోదీ ‘ఎవరికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు. ఎవరైనా చట్టం ముందు తల వంచాల్సిందే’నని ఉద్ఘాటించారు. అహింసకు భారత్ పెట్టింది పేరని పేర్కొన్న మోదీ గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ ప్రబోధాలను ఉటంకించారు. ఆదివారం జాతినుద్దేశించి మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ అన్ని సమస్యలు తీర్చడానికి, అందరికీ న్యాయం జరిగే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొదించారన్నారు. ఓ పక్క దేశ ప్రజలు పర్వదిన ఉత్సవాల్లో మునిగి తేలుతూంటే దేశంలో మరో చోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకలిగించే అంశమని మోదీ అన్నారు. ఎవరి పేర్లనూ మోదీ ప్రస్తావించక పోయినా ఆయన మాటల్లో మాత్రం హర్యానాలో డేరా సచ్చా కూటమి అనుచరులు సృష్టించిన హింసాకాండపై తీవ్ర ఆగ్రహం ప్రస్ఫుటమైంది. ‘మనది మహాత్ముడు, బుద్ధుడు జన్మించిన భూమి. దేశ సమైక్యత కోసం సర్వం త్యాగం చేసిన సర్దార్ పటేల్ పుట్టిన గడ్డ మనది. తరతరాలుగా అహింస, పరస్పర గౌరవం వంటి విలువలను మనం పుణికి పుచ్చుకున్నాం’అని మోదీ తెలిపారు. అహింసే పరమ ధర్మం అన్న నానుడిని ప్రస్తావించిన మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేశారు. మత, రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికన ఎలాంటి హింసాకాండను సహించేది లేదని తాను పేర్కొన్నానని గుర్తు చేసిన ఆయన ‘ఎవరైనా చట్టం ముందు తలవంచాల్సిందే..హింసకు పాల్పడేది వ్యక్తులైనా, మత కూటమి అయినా సహించేదే లేదు’అని తెలిపారు. ఇలాంటి విఘాతక చర్యలకు ఒడిగట్టే వారిని శిక్షించి తీరుతామని ఉద్ఘాటించారు. అరగంట పాటు దేశాన్నుద్దేశించి మాట్లాడిన మోదీ అనేక అంశాలను ప్రస్తావించారు. భారత దేశ శాంతి కాముకతను సాంప్రదాయక విలువలను ప్రధానంగా ప్రస్తావించారు. గతానికి భిన్నంగా హర్యానా హింసాకాండతోనే మోదీ మన్‌కీ బాత్ మొదలుకావడం ఆ సంఘటన పట్ల ఆయన ఆగ్రహాన్ని ఆవేదనను కళ్లకు కట్టింది.