జాతీయ వార్తలు

సైన్యానికి సాటి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: రక్షణ సన్నద్ధతలో మన సైన్యానికి సాటి లేదని, సాంకేతిక పరిజ్ఞానంలో ఈ రంగంలో ఇంకా ముందు కు వెళ్లాల్సిన అవశ్యకత ఉందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాస్తవ్రేత్తలనుద్దేశించి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మిథానీ, బిడిఎల్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా తయారు చేసిన ‘అస్త్ర’ క్షిపణిని నేవీకి లాంఛనంగా అందజేశారు. ఉపరితలంనుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. అదే కొత్తగా రూపొందించిన యుద్ధ ట్యాంక్‌ను సైన్యానికి అందజేశారు. 5 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్‌నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైట్లీ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందు కు వెళ్ళాలని అన్నారు. భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానానికి ఏ మాత్రం కొదువ లేదని, అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భారతీయులు విదేశాల్లోనూ అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. రక్షణ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. మన రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా ఉందని అన్నారు. భౌగోళికంగా చూస్తే మన దేశం ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉండాల్సిన అవసరముందని, అదే మనకు నిజమైన
రక్షణ అని ఆయన చెప్పారు. మన దేశ రక్షణ దళాల పట్ల ప్రజలంతా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారని ఆయన తెలిపారు.
దేశ ప్రజలు బాగా అభివృద్ధి చెందిన దేశాలకు సైతం చౌకగా ఉత్తమ సేవలందించే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా మనదేశానికి చెందిన మేధావులు వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా మానవ వనరులూ మనకు సమృద్ధిగా ఉన్నాయని, ఇతర దేశాలకూ సేవలు అందించగల శక్తి ఉందన్నారు. ఇతర దేశాల్లోని ఫార్మా, ఐటి రంగాలతో పోలిస్తే మనమే ముందున్నామని అన్నారు. ఉన్నత ప్రమాణాలు గల విద్య అందరికీ అందించాల్సిన అవసరం ఉందని అరుణ్ జైట్లీ తెలిపారు. నగర పర్యటనలో భాగంగా జైట్లీ ఇబ్రహీంపట్నంలోని బిడిఎల్ యూనిట్ రెండో దశకు భూమి పూజ చేశారు.

చిత్రం..‘అస్త్ర’ నమూనాను నేవీ అధికారికి అందజేస్తున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ