జాతీయ వార్తలు

ఆ మూడింటితో సామాజిక విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: జన్‌ధన్, ఆధార్, మొబైల్ సర్వీసులు.. దేశంలో ఈ మూడు అంశాలు ఒక సామాజిక విప్లవానే్న తీసుకు వస్తున్నాయని, వస్తు సేవల పన్ను దేశమంతా ఒకే మార్కెట్‌ను ఎలా సృష్టించిందో ఈ మూడు అంశాలు కూడా భారతీయులందరినీ ఒకే ఉమ్మడి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘దేశం ఇప్పుడు మూడు అంశాల్లో వందకోట్ల దరిదాపులకు చేరుకొంది. అదే వందకోట్ల ఆధార్ నంబర్లను వందకోట్ల బ్యాంక్ ఖాతాలకు, వందకోట్ల మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేయడం. ఒకసారి ఇది గనుక జరిగితే దేశమంతా కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో ఒకే తాటిపైకి వస్తుందని జైట్లీ అన్నారు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన మూడవ వార్షికోత్సవం సందర్భంగా జైట్లీ ఈట్విట్టర్ పోస్టు ఉంచారు. ‘వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఎలాగైతే ఒకే పన్ను, ఒకే మార్కెట్‌ను సృష్టించిందో అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ‘జామ్’ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) భారతీయులందరినీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి ఒకే తాటిపైకి తీసుకు వస్తాయి. అప్పుడు ఏ భారతీయుడు కూడా జాతీయ జన జీవనస్రవంతికి వెలుపల ఉండడు’ అని జైట్లీ అన్నారు. జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జామ్) ఒక సామాజిక విప్లవానికి ఏమాత్రం తీసిపోదని జైట్లీ అంటూ, ఇవి ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా పేదలకు గణనీయమైన ప్రయోజనాలను తీసుకు వచ్చాయని అన్నారు. సబ్సిడీల భారం తగ్గడంతోపాటుగా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లను తొలగించడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఫలితంగా ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి వీలవుతుందని, ఈ పథకాల ప్రయోజనాలను పేదలు నేరుగా పొందడంద్వారా తమ జీవితాల్లో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోగలుగుతారని జైట్లీ అన్నారు. పహల్, ఉపాధి హామీ పథకం, వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థుల ఉపకార వేతనాలు లాంటి వివిధ సంక్షేమ పథకాల కింద ప్రస్తుతం ప్రభుత్వం నెలకు ఆరువేల కోట్ల రూపాయల చొప్పున ఏటా 35 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 74 వేల కోట్లను నేరుగా బదిలీ చేస్తోందని ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలు 2015 జనవరిలో 12.55 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి 29.52 కోట్లకు పెరిగాయని జైట్లీ తెలిపారు. అదే సమయంలో ఈ పథకం కింద ప్రారంభించిన గ్రామీణ ఖాతాల సంఖ్య 7.54 కోట్లనుంచి 17.64 కోట్లకు పెరిగాయని, అలాగే ఒక్కో ఖాతా నిల్వ సగటు సైతం రూ.837 నుంచి రూ.2,231కి పెరిగినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జన్‌ధన్ యోజన కింద దాదాపు 7 కోట్ల మంది పేదలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపులు జరుపుతున్నారని జైట్లీ తెలిపారు. ఈ లక్ష్యం చాలా పెద్దది అని ఆయన అంటూ అయినప్పటికీ ముందుకు సాగుతామని చెప్పారు.