జాతీయ వార్తలు

అమెరికా అధ్యక్ష పీఠంపై తెలుగు తేజం ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: అమెరిగా అధ్యక్ష పీఠాన్ని ఏదో ఒకరోజు తెలుగు వ్యక్తి అధిరోహిస్తారని మాజీ ఎంపీ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా డెట్రాయిట్ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవ సదర్భంగా శనివారం ఏర్పాటుచేసిన సభలో యార్లగడ్డ ప్రసంగించారు. 1993లో నందమూరి తారక రామారావు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక బేగంపేట విమానాశ్రయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదో ఒక ప్రవాస భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వ్యక్తి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని చెప్పారని, అయితే అప్పట్లో ప్రజలు వింతగా చూశారని అన్నారు. ప్రస్తుతం తెలుగువారు అమెరికా రాజకీయాల్లో పెనవేసుకున్న బంధాన్ని చూస్తుంటే ఎన్టీఆర్ ఆశయాన్ని సాధిస్తారని అనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మిషిగన్ కాంగ్రెస్‌మెన్ డాని కిల్డీ, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు అరుణా మిల్లర్, డా.ముక్కామల బాబీ, సంఘం చైర్మన్ కోనేరు శ్రీనివాస్, సమన్వయకర్త మారెంరెడ్డి సాగర్, అధ్యక్షుడు అంచె హర్ష తదితరులు పాల్గొన్నారు.