జాతీయ వార్తలు

డేరాబాబా ఆస్తుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 27: హైకోర్టు ఆదేశాల మేరకు డేరా సచ్చా సౌదా బాబాకు చెందిన స్థిర, చరాస్తులను గుర్తించడం ప్రారంభించినట్లు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆదివారం చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన రెవిన్యూ అధికారులు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు చెందిన డేరా ఆస్తుల వివరాల జాబితాను తయారు చేస్తున్నారు. డేరా ఖాతాలకు చెందిన వివరాలను తెలియజేయాలని బ్యాంకులను కూడా కోరినట్లు వారు చెప్పారు. డేరాకు చెందిన ఆస్తులు, ఆదాయాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను యుద్ధప్రాతిపదికపై రూపొందించడం జరుగుతోందని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న ఓ అధికారి చెప్పారు. ఒకవేళ బాబా అనుయాయులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడినట్లు తేలితే జప్తు చేయడానికి డేరాకు చెందిన స్థిర చరాస్థుల వివరాలను మంగళవారం నాటికల్లా సమర్పించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ రెండు రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.