జాతీయ వార్తలు

హర్యానా, పంజాబ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శిక్షను ఖరారు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని హర్యానా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, సిర్సా కేంద్రంగా పని చేస్తున్న డేరా సచ్చాసౌదా బ్యాంక్ ఖాతాలను జప్తు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారని, ఇంతకు ముందు జరిగిన హింసాకాండలో నష్టపోయిన బాధితులకు ఈ సొమ్మునుంచి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి వి ఉమాశంకర్ చెప్పారు. డేరా సచ్చా ప్రధాన కార్యాలయంలో స్థానికులుగా ఉంటున్న వారు కాకుండా బయటి ప్రాంతాలకు చెందినవారు వెయ్యి మందికి మించి లేరని ఆయన చెప్పారు. గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉంటున్న ఉమాశంకర్‌ను సిర్సా పాలనా యంత్రాంగానికి తోడ్పాటు అందించడానికి ప్రత్యేక డ్యూటీపై నియమించారు.
సోమవారం డేరా సచ్చాబాబాకు శిక్షను ఖరారు చేయనున్న దృష్ట్యా రోహ్‌తక్ పట్టణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలోను, చుట్టుపక్కల, అలాగే డేరా సచ్చాసౌదా బాబా ఉన్న సునారియా జైలు వద్ద పోలీసులు, 23 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవసరమైతే రంగంలోకి దిగడానికి వీలుగా సైన్యాన్ని సైతం సిద్ధంగా ఉంచారు. గత శుక్రవారం అత్యాచారం కేసులో డేరా బాబాను దోషిగా ప్రకటించిన తర్వాత చెలరేగిన అరాచక పరిస్థితి పునరావృతం కాకుండా చూడడానికి అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకున్నారు. ఆ రోజు పంచకుల, సిర్సాలలో జరిగిన విధ్వంసకాండలో 36 మంది చనిపోగా, 250 మందికి పైగా గాయపడ్డం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వబోమని అధికారులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే తుపాకులకు పని చెప్పాల్సి ఉంటుందని, కనిపిస్తే కాల్చివేతకు సైతం తమకు ఆదేశాలున్నాయని రోహ్‌తక్ సీనియర్ పోలీసు అధికారి నవ్‌దీప్ సింగ్ చెప్పారు. సిబిఐ జడ్జి శిక్షలను ప్రకటించే సునారియా జైలుకు పది కిలోమీటర్ల దూరం వరకు భద్రతా ఏర్పాట్లు చేశారు.
చట్టాన్ని ధిక్కరించి ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ముందు వారిని హెచ్చరిస్తాం.. వినక పోతే కాల్పులు జరపడానికి సైతం వెనుకాడం అని రోహ్‌తక్ డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ చెప్పారు. వార్తలను కవర్ చేయడానికి వచ్చిన వందలాది మంది మీడియా ప్రతినిధులకు సైతం ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించారు. ఎవరని కూడా జైలు లోపలికి అనుమతించలేదు. మరోవైపు డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగింది. ముందుజాగ్రత్త చర్యగా హర్యానా అంతటా సోమవారం పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేశారు. పంజాబ్‌లో మాత్రం సున్నితమైన జిల్లాల్లో మాత్రం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు శుక్రవారం హింసాకాండ కారణంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రైలు సర్వీసులను ఢిల్లీ-రోహ్‌తక్-్భటిండా మార్గంలో తప్ప మిగతా అన్ని మార్గాల్లో పునరుద్ధరించడం జరుగుతోందని ఢిల్లీలో రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల్లోను మంగళవారం మధ్యాహ్నం దాకా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

చిత్రం..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శిక్ష విధించేందుకు రోహ్తక్‌లోని
సునారియా జైలుకు హెలికాప్టర్‌లో వస్తున్న సిబిఐ జడ్జి