జాతీయ వార్తలు

పనాజీలో గెలిచిన పారికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: గోవాలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనాజీలో భారీ ఓట్లతో గెలుపొందారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె వాల్పోయ్ స్థానాన్ని గెలుచుకున్నారు. అటు ఢిల్లీలోని బావనా నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ ఉత్తేజాన్నిచ్చింది. ఈ స్థానంలో ఆప్ ఘనవిజయం సాధించింది. గోవాలో రెండు స్థానాల్లో ముఖ్యమైన పనాజీలో పారికర్‌కు 9862 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి గిరిశ్ చోడాంకర్ 5059 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. పారికర్‌పై పోటీ చేసిన గోవా సురక్షా మంచ్ అధ్యక్షుడు ఆనంద్ షిరోద్కర్‌కు కేవలం 220 ఓట్లు పోలయ్యాయి. గత మార్చిలో గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ తన పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. పనాజీ నుంచి విజయం సాధించటంతో తన రాజ్యసభ సభ్యత్వానికి వచ్చేవారం రాజీనామా చేస్తానని పారికర్ సోమవారం ప్రకటించారు. తనకు ఓట్లేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారికర్‌ను ప్రధాన మంత్రి మోదీ అభినందించారు. మరోవైపు వాల్పోయ్‌లో మంత్రి విశ్వజిత్ రాణె తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన రోయ్ నాయక్‌పై 10, 066 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వరుస అపజయాలతో ఉనికి ప్రశ్నార్థకం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోని బావనా నియోజకవర్గంలో లభించిన గెలుపు తిరిగి ఊపిరినిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు చెందిన అభ్యర్థి రామ్‌చందర్ బిజెపి అభ్యర్థి వేద్ ప్రకాశ్‌పై దాదాపు 24వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, పంజాబ్, గోవా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన అనంతరం ఆప్‌కు లభించిన విజయం ఇదే. తన రెండున్నరేళ్ల పరిపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయం సాధించిన తరువాత ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ బిజెపి కార్యకర్తలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్న దృశ్యం