జాతీయ వార్తలు

గుర్మీత్ కుమారుడే డేరా వారసుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 28: పదిహేనేళ్ల నాటి జంట మానభంగాల కేసులో డేరా సచ్చా అధినేత గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన వారసుడిగా కొడుకు జస్మీత్ ఇన్సాన్ నియమితులయ్యారు. గుర్మీత్ వారసుడెవరన్న దానిపై సోమవారం విస్తృత స్థాయిలో ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆయన తల్లి నసీబ్ కౌర్ ఈ నిర్ణయం ప్రకటించారు. గుర్మీత్ కుమారుడు, తన మనవడైన ఇన్సాన్‌కు ఈ పదవి కట్టబెట్టారు. 2007లో అత్యాచార అభియోగాలు దాఖలైనప్పుడు కూడా గుర్మీత్ తన కుమారుడ్నే వారసుడిగా ప్రకటించారు. ఈ నియామకం ద్వారా రక్త సంబంధీకులకే డేరా వారసత్వం లభించినట్టయింది. 1948లో షా మస్తానా బలోచిస్తానీ ఓ సామాజిక సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా డేరాను ఏర్పాటు చేశారు. 1960లో షా సత్నామ్ సింగ్‌ను తన వారసుడిగా ప్రకటించారు. 30 ఏళ్ల తర్వాత 1990లో సత్నామ్ సింగ్ వారసుడిగా గుర్మీత్ సింగ్ నియమితులయ్యారు. పగ్గాలు చేతికి రాగానే డేరా సంస్థను తన వ్యక్తిగత ఆస్తిగా భావించిన గుర్మీత్ తన కుమారుడ్నే వారసుడిగా ప్రకటించారు. గుర్మీత్ పెంపుడు కుమార్తె హనీప్రీత్‌కే డేరా అనుచరుల్లో ఎక్కువ పలుకుబడి ఉండడంతో ఆమెనే బాబాకు వారసురాలవుతారని డేరా అనుచరుల్లో ఎక్కువ మంది భావించారు. ట్విట్టర్‌లో పది లక్షలు, ఫేస్‌బుక్‌లో అయిదు లక్షలకు పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె సొంతంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. అయతే గుర్మీత్ కుమారుడే వారసుడని ఆయన తల్లి ప్రకటించడంతో వారసులపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.