జాతీయ వార్తలు

హర్యానా సర్కార్‌ను ఎందుకు బర్తరఫ్ చేయలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 28: మతం పేరుతో హింసను సహించేది లేదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బిఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేస్తూ డేరా సచ్చాసౌదా అనుయాయులు హింసాకాండకు పాల్పడిన తర్వాత హర్యానా ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఆదివారం తన ‘మన్ కీ బాత్’లో చెప్పిన మాటల్లో ఏమయినా నిజం, నిజాయితీ ఉన్నట్లయితే పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఇప్పటికే బర్తరఫ్ చేసి ఉండాల్సిందని మాయావతి అన్నారు. బిజెపి అగ్రనాయకత్వం కేవలం మాటలు చెప్పడానికే తప్ప వాస్తవంలో ఏమీ చేయదనే విషయాన్ని ఇది నిరూపిస్తోందని అన్నారు. హర్యానాలో తాజాగా జరిగిన సంఘటనలు ఆయన పార్టీ ప్రభుత్వం తొలి పరీక్షలోనే ఫెయిలయిందనే విషయాన్ని రుజువు చేసిందని అన్నారు.