జాతీయ వార్తలు

విచారణలో జాప్యం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపు దాఖలు చేసుకున్న అనేక బెయిలు పిటిషన్లను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం ఆయన మరోసారి దాఖలు చేసుకొన్న బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి అయిన బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సిందిగా గత ఏప్రిల్‌లోనే ఆదేశాలిచ్చినప్పటికీ ఇంతవరకు ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, అమితావ రాయ్‌లతో కూడిన బెంచ్ గుజరాత్ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇప్పటికే బాబా అనుచరులు జరిపిన దాడుల్లో ఇద్దరు కీలక సాక్షులు మృతి చెందారని, మరో 17 మంది గాయపడ్డారని, బాధితురాలికి తగిన భద్రత కల్పించిన తర్వాత కోర్టు ఆమెను విచారిస్తుందని మెహతా చెప్పారు. కాగా, ట్రయల్ కోర్టు కేసు తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 23కు ముందే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలి తరఫు న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశిస్తూ తదుపరి విచారణను దీపావళి తదుపరి తేదీకి వాయిదా వేసింది.
ఆశారాం బాపు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక 2013లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఉన్నప్పుడు బాబా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై రాజస్థాన్ పోలీసులు అదే ఏడాది ఆగస్టు 31న ఆశారాం బాపును అరెస్టు చేయగా, ఆయన అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. ఆశారామ్ బాపు కుమారుడు నారాయణ్ సాయి కూడా మరో అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే.