జాతీయ వార్తలు

‘బ్రిక్స్’కోసమే మెట్టుదిగిన చైనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: చైనాలో సెప్టెంబర్ మూడు నుండి జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బాయికాట్ చేసేందుకు సిద్ధపడినందుకే డోక్లామ్ నుండి తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్న బ్రిక్స్ దేశాల అధినాయకుల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ మూడు నుండి మూడు రోజులపాటు జరుగుతుంది. డోక్లామ్‌లో భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజింగ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశాన్ని బాయికాట్ చేయాలనుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశం అత్యంత హట్టహాసంగా భారత్ నిర్వహించిన నేపథ్యంలో బీజింగ్ శిఖరాగ్ర సమావేశం విఫలం కావటం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదని విదేశీ వ్యవహారాల శాఖాఅధికారులు చెబుతున్నారు. దీనికితోడు అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు డోక్లామ్ విషయంలో భారతదేశానికి మద్దతు ఇవ్వటంతో చైనాను ఇబ్బందిలో పడవేసిందని అంటున్నారు. డోక్లామ్ సమస్యను పరస్పర చర్చలద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా, బ్రిటన్ సూచించగా ఇందులో చైనాదే తప్పున్నదని జపాన్, ఆస్ట్రేలియా దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇదిలా ఉంటే భారత, చైనాల మధ్య యుద్ధం జరిగితే చైనాకే ఆర్థికంగా నష్టం జరగటంతోపాటు వేలకోట్లు పెట్టుబడి పెడుతున్న వన్ బెల్ట్ వన్ రోడ్ పథకం దెబ్బతింటుంది. ఇదే జరిగితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చైనా మరింత దెబ్బతింటుంది.
అందుకే డోక్లామ్ విషయంలో పట్టుపట్టకుండా చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకున్నారని అంటున్నారు. భారత దేశం మొదట తమ సైన్యాలను ఉపంహరించుకోవాలన్న డిమాండ్‌కు కట్టుబడి వ్యవహరిస్తే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతోపాటు వన్ బెల్ట్, వన్ రోడ్ పథకం కూడా దెబ్బతినే ప్రమాదం నెలకొనటం వల్లనే చైనా దిగిరాకతప్పలేదని భావిస్తున్నారు.