జాతీయ వార్తలు

మిస్ ఏషియా పసిఫిక్‌గా తెలుగమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: గీతం ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఇ విద్యార్థిని మానస జొన్నలగడ్డ మిస్ అండ్ మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ -2017 టైటిల్ విజేతగా నిలిచినట్టు గీతం వర్శిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ చెప్పారు. మిస్ అండ్ మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ పోటీలు థాయిలాండ్ పట్టాయలో జరిగాయని, మన దేశంతో పాటు దుబాయి, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంకకు చెందిన ఔత్సాహికులతో మానస పోటీపడి టైటిల్‌ను కైవసం చేసుకుందని ఆయన చెప్పారు. మరో పక్క గీతం విద్యార్థులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పలు విజయాలు నమోదు చేశారని అన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్ధిని శివాలీ తన తల్లి కవితతో కలిసి రెండో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సాధించిందని అన్నారు. శివాలి, ఆమె తల్లి కవిత కలిసి క్లివ్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో 7011 పూలను అల్లి ఈ గిన్నీస్ రికార్డును సాధించారని అన్నారు. కాగా కాంబోడియాలో సెప్టెంబర్ 14 నుండి 16వరకూ జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్లీనరీ స్పీకర్‌గా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి త్రినాధరావు హాజరుకానున్నారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.