జాతీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు ఎన్జీటీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ఈ సెప్టెంబర్ 4లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, వన్యప్రాణిబోర్డు అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని హయాతుద్దీన్ అనే ప్రాజెక్టు నిర్వాసితుడు ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం నాడు జస్టిస్ జావేద్ రహీం నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేసిందని, అలాగే ప్రాజెక్టు అనుమతుల విషయంలో మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ)కూడా అభ్యంతరం తెలిపిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని వాదించారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ పిటిషనర్ల అభ్యంతరాలపై వచ్చే నెల 4లోగా తన వాదనలను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.