జాతీయ వార్తలు

సవాళ్లకు బెదరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్‌పూర్ (రాజస్తాన్), ఆగస్టు 29: తమ ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని నిబద్ధతతో అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా మొత్తం వ్యవస్థే చతికిల పడిందని మంగళవారం ఖేల్‌కావ్‌లో జరిగిన భారీ ర్యాలీలో అన్నారు. మూడేళ్ల క్రితం ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థే కుంటుపడిపోయిన స్థితిలో ఉందని గుర్తు చేశారు. ‘అలాంటి సమయంలో అధికారం చేపట్టిన మేము ధైర్యంగా ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదే’నని మోదీ అన్నారు. కానీ అలాంటి బలహీనతలు, అధైర్యానికి తాము అవకాశం ఇవ్వలేదని సవాళ్లను స్వీకరించి పరిష్కారాలు కనుగొంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని మోదీ ఉద్ఘాటించారు. దాదాపు 15వేల కోట్ల వ్యయం అయ్యే పలు హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు మోదీ ఇక్కడికి వచ్చారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తామని పేర్కొన్న ప్రధాని ‘ మా నిర్ణయాలు ఎంత ధైర్యంగా ఉంటాయో..వాటి అమలుకూ అంతే పట్టుదలతో పనిచేస్తాం’అని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజస్తాన్ రూపురేఖలే మారిపోతాయని చెప్పిన ఆయన ‘నేను ప్రారంభిస్తున్న పలు ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నవే’నంటూ గత యూపీఏ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. భారత్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు వౌలిక సదుపాయాలు, రైల్వేలు, రహదారులూ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. సరైన రోడ్లు ఉంటే రైతులకూ ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్న ఆయన ఈ ఉద్దేశంతోనే దేశ వ్యాప్తంగా బలమైన రహదారుల నెట్‌వర్క్ ఉండాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో భారీ వాగ్దానాలు గుప్పించే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగిందని గత ప్రభుత్వాలపై చురకవేసిన మోదీ ‘ఈ దుష్ట సంప్రదాయాన్ని తొలగించడం ఓ సవాలు. దీన్ని రూపుమాపడానికి ఎంత ధైర్యం కావాలో మీరు ఊహించనే లేరు’ అని ర్యాలీనుద్దేశించి అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తూ వస్తోందని, ఇందుకు సంబంధించిన కార్యక్రమాల వేగాన్ని, పరిధిని, స్థాయినీ పెంచామని ప్రధాని తెలిపారు. వరద బీభత్సానికి గురైన రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చిత్రం..రాజస్థాన్ పర్యనటకు వచ్చిన ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానిస్తున్న
ముఖ్యమంత్రి వసుంధర రాజె, గవర్నర్ కల్యాణ్ సింగ్