జాతీయ వార్తలు

..అదే జరిగితే పురుషులకు వేధింపులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29:్భర్య అంగీకారం లేకుండా జరిగే వైవాహిక సంపర్కాన్ని మానభంగంగా పరిగణించి శిక్షార్హ నేరంగా ప్రకటిస్తే పురుషులు మరింతగా భార్యల వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. భార్య అంగీకారం లేకుండా జరిపే సెక్స్‌ను మానభంగంగా పరిగణిం చి, సదరు వ్యక్తిని శిక్షించాలంటూ అనేక మహిళా సంఘా లు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందిస్తూ కేంద్రం ఈ మేర కు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘మారిటల్ రేప్’ అన్నది భర్తలను వేధించడానికి భార్యలకు బలమైన ఆయుధమే అవుతుందని పేర్కొన్న కేంద్రం ‘్భర్య, భర్తల మధ్య జరిగే లైంగిక కృత్యాలకు ఎలాంటి ఆధారాలు ఉండవు’అని కేం ద్రం తెలిపింది. దీన్ని నేరంగా పరిగణిస్తే మొత్తం వివాహ వ్యవస్తే పతనమైపోతుందని కూడా కేంద్రం స్పష్టం చేసిం ది. దీని దృష్ట్యా ఈ విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలని సూచించింది. కాగా, అత్యాచారాన్ని నిర్వచించే ఐపిసి 375 సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా కొట్టివేయాలని మహిళా సంఘాలు తమ పిటిషన్లలో డిమాండ్ చేశాయి. భర్తల చేతిలో అత్యాచారాలకు గురయ్యే మహిళల పట్ల ఈ సెక్షన్ వివక్ష చూపుతోందని పేర్కొన్నాయి.