జాతీయ వార్తలు

బ్రిక్స్ సమ్మిట్‌కు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 3-5 తేదీల్లో బ్రిక్స్ సమ్మిట్ జరుగుతోంది. డోక్లామ్‌లో 73 రోజులపాటు నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సడలిపోయిన నేపథ్యంలో మోదీ పర్యటన జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డోక్లామ్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకోడానికి చైనా అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘్ఫ్యజియాన్ ప్రొవెన్స్‌లో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని తీసుకురావడంలో చైనా అధ్యక్షుడి కృషి ఫలించింది. ఆయన జోక్యంతోనే మోదీ పర్యటనకు మార్గం సుగమం అయింది. వచ్చేనెల 3 నుంచి 5 వరకూ తొమ్మిదో బ్రిక్స్ సమ్మిట్ జరుగుతోంది’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. చైనాలో బ్రిక్స్ సమావేశాలు ముగించుకుని ప్రధాని మోదీ మైన్మార్ వెళ్తారు. 5 నుంచి 7 వరకూ మైన్మార్‌లో ఆయన పర్యటన ఉంటుంది. 2014 నవంబర్‌లో జరిగిన ఆసియాన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోదీ మైన్మార్ వెళ్తారు.