జాతీయ వార్తలు

న్యాయ పనితీరు నిర్ధారణకు సూచీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: న్యాయ వ్యవస్థ పనితీరుకు ఎప్పటికప్పుడు పదును పెట్టే రీతిలో న్యాయ పనితీరు సూచీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ సూచించింది. ముఖ్యంగా దిగువ న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు జాప్యాన్ని నివారించడానికి కూడా ఈ సూచీ ఎంతగానో ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా న్యాయ నియామకాలను క్రమబద్ధీకరించాలని కూడా సూచించింది. న్యాయ సంస్కరణల్లో భాగంగానే ఈ దిశగా తొలి అడుగు వేయాలని స్పష్టం చేసింది. న్యాయ పనితీరు సూచిని ఏర్పాటు చేయడం వల్ల హైకోర్టులకు, హైకోర్టు న్యాయమూర్తులకు ఎప్పటికప్పుడు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని, దీని ఆధారంగా పనితీరును సమీక్షించడంతోపాటు జిల్లా స్థాయిల్లో మెరుగుదలను సాధించడానికి అవకాశం ఉంటుందని తాజాగా సమర్పించిన నివేదికలో నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వివిధ రకాల కేసుల పరిష్కారానికి సంబంధించి నిర్బంధం కాని రీతిలో కాల వ్యవధిని నిర్ధారించాలని, అదే విధంగా ఓ కేసు పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగితే అందుకు సంబంధించిన నివారణ చర్యల్లో భాగంగా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.