జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి సి-39 ప్రయోగం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/సూళ్లూరుపేట, ఆగస్టు 31: వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకొన్న ఇస్రోకు చాలాకాలం తరువాత ఎదురుదెబ్బ తగిలింది. ఒకటి రెండు కాదు ఏకంగా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడమే కాకుండా భారీ ప్రయోగాలను సైతం సునాయాసంగా విజయాలను అందుకొన్న ఇస్రోకు తన నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలమవడంతో నిరాశ మిగిల్చింది. 24 ఏళ్లగా పిఎస్‌ఎల్‌విల వరుస విజయపరంపరలకు షార్‌లో బ్రేకు పడింది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ )కేంద్రం నుంచి గురువారం ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ ప్రయోగం విఫలం అయింది. అంతకుముందు బుధవారం మధ్యాహ్నం 2గంటలకు
కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యి 29గంటలు సజావుగా పూర్తిచేసుకొన్న అనంతరం పిఎస్‌ఎల్‌వి వాహక నౌక నిర్దేశించిన సమయానికే గురువారం రాత్రి 7గంటలకు రెండో ప్రయోగవేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగివైపు కదలింది. మొదటి దశలో ఘన ఇంధనంతో ప్రారంభమైన రాకెట్ తన రెండు మూడు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొంది. నాలుగో దశ పూర్తిచేసుకొన్నంతరం రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహానికి అమర్చి ఉన్న హీట్‌షీల్డ్(ఉష్ణకవచం) తెరుచుకోకపోవడంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో రాకెట్ గమనాన్ని చూస్తున్న శాస్తవ్రేత్తల్లో ఆందోళన మొదలైంది. మామూలుగా అయితే నాలుగో దశ పూర్తిచేసుకొన్నంతరం రాకెట్ హీట్‌షీల్డ్‌లో ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని నిర్దేశించిన సమయం అనగా 19:25నిమిషాలకు కక్ష్యలోకి విడిచిపెట్టాలి. 20నిమిషాలు దాటినా హీట్‌షీల్డ్ తెరుచుకోలేదు. అప్పటికే రేంజ్ ఆపరేషన్ వారు ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్న ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ లేచి రేంజ్ ఆపరేషన్ వారి దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. మీడియా సెంటర్‌లో ఉన్న మీడియాకు సైతం ఏమి అర్ధం కాలేదు. అప్పటికే 23నిమిషాలు దాటింది. స్కీన్‌లో మాత్రం రాకెట్ పయనమయ్యే దృశ్యాలు కనబడుతున్నాయి. ఏమి అయ్యిందో ఏమో ఎవరికి అర్థం కాలేదు. ఇంతలో చైర్మన్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుండే నేరుగా మీడియాతో మాట్లాడుతూ పిఎస్‌ఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం నాలుగో దశలో హీట్‌షీల్డ్ తెరుచుకోలేదని దీంతో ఉపగ్రహం దాని నుండి బయటకు రాలేదన్నారు. వాహక నౌక అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన ఉపగ్రహం ఉష్ణకవచం నుండి బయటకు రాకుండా మోటారు సాయంతో అంతరిక్షంలోకి పయనమవుతూ ఉండడంతో విఫలమయ్యినట్లు నిర్ధారించారు.
చివరి దశలో నిరాశ...
ఇస్రో గెలుపుగుర్రం నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగం శాస్తవ్రేత్తలకు చివరి దశలో నిరాశ మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నాలుగో దశలో ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం విడిపోకపోక సరైన సంకేతాలు అందకపోవడంతో అపజయాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. నావిగేషన్ వ్యవస్థకు కోసం ఇస్రో 11సంవత్సరాలు పాటు శ్రమించి మొత్తం 7 ఉపగ్రహాలను విజయవతంగా ప్రయోగించింది. అయితే తొలి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి సేవలు అందించలేకపోయింది. దాని స్థానంలో ఎనిమిదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో సిద్ధమైంది. ఆ మేరకు మూడేళ్లపాటు రూపొందించి ప్రయోగించేందుకు శ్రీకారం చుట్టారు. ఇది విజయవంతమై ఉంటే మన దేశం సొంతంగా నావిగేషన్ వ్యవస్థ రూపొందించి ఉండేంది. మరో ఒక అడుగు దూరంలో పూర్తి సేవలు అందతాయన్న తరుణంలో ప్రస్తుతం ప్రయోగించిన రాకెట్ ద్వారా చివరి నాలుగో దశలో ఆశించిన విధంగా హీట్‌షీల్డ్ విడిపోక కక్ష్యలోకి చేరకపోవడంతో ఇస్రో ఆశలను అడి ఆశలు అయ్యాయి.

చిత్రం..తొలి దశలో రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పయనమవుతున్న దృశ్యం.