జాతీయ వార్తలు

శిశువు అబార్షన్‌కు సుప్రీం అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: మహిళ గర్భంలో బిడ్డ ఎదుగుదల లేనందున అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. పూణెకు చెందిన ఓ మహిళకు ఉపశమనం కలిగిస్తూ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. పూణెకు చెందిన బిజె ప్రభుత్వం మెడికల్ కళాశాల నివేదికను పరిశీలించిన బెంచ్ 24 వారాల పిండాన్ని తొలగించుకోడానికి అనుమతి తెలిపింది. 20 ఏళ్ల యువతి గర్భం దాల్చింది. ఆమె పూణె ఆసుపత్రి లో పరీక్షలు చేయించుకోగా గర్భంలో శిశువుఎదుగుదల లేదని తేల్చారు. పుర్రె, మెదడు పెరగలేదని వైద్యులు పేర్కొన్నారు. ఎదుగుదల పూర్తిగా ఆగిపోయినందున కష్టమని వారు చెప్పారు. అబార్షన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్య కళాశాల నివేదిక పరిశీలించిన బెంచ్ గురువారం అనుమతి ఇచ్చింది. ఇలాంటి కేసుల విషయంలో మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని గతంలోనే కోర్టు పేర్కొంది. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేయాలని కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌కు ధర్మాసనం సూచించింది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు తెలిపిందని కుమార్ అన్నారు.