జాతీయ వార్తలు

చేయి చాచలేను.. బిచ్చమెత్తలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే14: ‘నేను జాతిపిత మహాత్మా గాంధీ మనుమడిని, తల దాచుకునేందుకు ఒక ఇంటికోసం వెతుకుతున్నాను, సహాయంకోసం ప్రభుత్వాన్ని లేదా ఇతరులను చేయిచాచి అడగలేను, బిచ్చమెత్తలేను’ అని మహాత్మా గాంధీ మనుమడు కనుభాయి రాందాస్ గాంధీ (87) చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ తనంత తాను ముందుకు వచ్చి ఏదైనా సహాయం చేస్తే తీసుకుంటాను లేకపోతే ఇలాగే ఈ ఆశ్రమంలోనే ఉంటామని ఆయన అంటున్నారు. కనుభాయి రాందాస్ గాంధీ, ఆయన భార్య శివలక్ష్మి గాంధీ (85) ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గురువిశ్రాం వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారు. అమెరికా నుండి తిరిగివచ్చిన అనంతరం 2014 నుండి ఇంతకాలం గుజరాత్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసించిన వీరిద్దరు వారం రోజుల క్రితం ఢిల్లీకి ఎలా వచ్చారనేది అంతుపట్టటం లేదు. గాంధీ కుమారుడు రాందాస్ గాంధీ మూడో కుమారుడైన కనుభాయి రాందాస్, ఆయన భార్య శివలక్ష్మి గాంధీ ఇటీవలే ఢిల్లీకి వచ్చి ఈ ఆశ్రమంలో చేరారు. గాంధీ మనుమడు కావటంతో వృద్ధుల ఆశ్రయం నిర్వాహకులు ఒక ఏసి కొనుగోలు చేసి వారికిచ్చిన గదిలో ఏర్పాటుచేశారు.
సంతానం లేని కనుభాయి రాందాస్ గాంధీ, ఆయన భార్య నలభై ఏళ్లపాటు అమెరికాలో నివసించిన అనంతరం 2014లో భారతదేశానికి తిరిగి వచ్చారు. మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు పధ్నాలుగేళ్ల బాలుడైన కనుభాయిని ప్రధాన మంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రు, అమెరికా రాయబారి కనె్నత్ గాల్‌బ్రేత్ అతన్ని విద్యాభ్యాసంకోసం అమెరికా పంపించారు. ఆయన అప్పటినుండి అమెరికాలోనే ఉండిపోయారు. మసాచుసెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో అప్లయిడ్ మేథమాటిక్స్ చదివిన కనుభాయి రాందాస్ గాంధీ నాసా పరిశోధనా సంస్థలో కొంతకాలం విమానాల రెక్కల నిర్మాణంపై పరిశోధనలు చేశారు. బయోకెమెస్ట్రీలో పిహెచ్‌డి చేసిన శివలక్ష్మీ గాంధీ బోస్టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆ తరువాత ఆమె స్టన్ బయోకెమికల్ పరిశోధనా సంస్థలో చేరారు. అయితే నిధులు ఆగిపోవటంతో దానికి స్వస్తి పలికారు. తాము ఉన్నదంతా పోగొట్టుకున్నాం, ఏదైనా వృద్ధాశ్రమంలో చేరి కాలం వెళ్లదీయాలనుకుంటున్నాము అని కనుభాయిం చెబుతున్నారు.