జాతీయ వార్తలు

25 వారాల గర్భ విచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: గర్భంలోని శిశువు కారణంగా తల్లి ప్రాణాలకు ముప్పు ఎదురవుతుందన్న వైద్యుల నివేదిక ఆధారంగా ఓ తల్లి తన 25 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. సాధారణంగా ఆరు నెలలకు పైబడిన గర్భాన్ని తొలగించుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే పుణెకు చెందిన 22 ఏళ్ల మహిళ గర్భంలోని శిశువుకు పుర్రె లేదని, ఈ లోపానికి ఎలాంటి చికిత్స కూడా లేదని వైద్యులు పేర్కొనడమే కాకుండా అలాగే పూర్తి కాలం గర్భంలోనే పిండం ఉంటే తల్లి ప్రాణాలకు కూడా ముప్పని వైద్యుల నివేదిక పేర్కొనడంతో ఆ మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించింది. పుర్రె లేకుండా శిశువు బతికి ఉండే అవకాశమే లేదని, అందువల్ల గర్భాన్ని కొనసాగించడంలో అర్థం లేదని వైద్యుల నివేదిక స్పష్టం చేసిందని, అందువల్ల పిటిషనర్ తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించడం న్యాయమని భావిస్తున్నామని న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎల్‌ఎన్ రావులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. తన గర్భంలోని శిశువుకు పుర్రె లేదని, అది తన ప్రాణాలకు కూడా ముప్పేనని, అందువల్ల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలని పుణెకు చెందిన 22 ఏళ్ల మహిళ సుప్రీంకోర్టును ఆవ్రయించింది. దీనిపై న్యాయస్థానం ఆమెను పరీక్షించాల్సిందిగా పుణె బిజె ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రి వైద్య బృందాన్ని కోరింది. మహిళను పరీక్షించిన వైద్యుల బృందం గర్భంలోని శిశువుకు పుర్రె, మెదడు పూర్తిగా లేవని, అందువల్ల ఆ శిశువు జీవించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒక వేళ పుట్టినా ఆ శిశువు 24 గంటల్లోనే చనిపోతుందని స్పష్టం చేశారు.