జాతీయ వార్తలు

బలపరీక్ష పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తమిళనాడు రాజకీయా లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రతిపక్షాల నేతలు బుధవారం రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును కలిసి సిఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్ష నిర్వహించాలని కోరిన విషయం తెలిసిందే. సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి చెప్పారు.
ఇదే అంశంపై డిఎంకె నేతృత్వంలో దాని మిత్రపక్షాలయిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన ఎంపీలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వంపై బలపరీక్షను నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు రాష్టప్రతిని కోరారు. అన్నాడిఎంకెలోని దినకరన్ వర్గానికి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని అందువల్ల ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని వారు రాష్టప్రతికి తెలిపారు. రాష్టప్రతిని కలిసిన వారిలో డిఎంకె ఎంపీలతో పాటుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా కూడా ఉన్నారు.
రాష్టప్రతితో భేటీ అనంతరం డి రాజా విలేఖరులతో మాట్లాడుతూ, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయని, దాని పునాదులే ప్రమాదంలో పడ్డాయని అన్నారు. బలపరీక్షకు ఆదేవించడం ద్వారా గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకొని ఉండాల్సిందన్నారు. కాగా, గవర్నర్ బలపరీక్షకు ఆదేశించేంతవరకు తాము వివిధ అథారిటీల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని డిఎంకె నేతలు అన్నారు.
అన్నాడిఎంకెకు 113 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, అసెంబ్లీలో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని తాము రాష్టప్రతికి వివరించామని డిఎంకె రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు. పార్టీలో తలెత్తన విభేదాలు అంతర్గత సమస్య అని అన్నాడిఎంకె నేతలు చెప్పడం గురించి అడగ్గా, ఇది ఎంతమాత్రం పార్టీ అంతర్గత సమస్య కాదని మరో రాజ్యసభ సభ్యురాలు కనిమోళి అన్నారు. ఇంతకు ముందు ఒ పన్నీర్‌స్వామి బలపరీక్షకు డిమాండ్ చేసినప్పుడు గవర్నర్ వెంటనే బలపరీక్షకు ఆదేశించారని, ఇప్పుడు మాత్రం అలా ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

చిత్రం..గురువారం ఢిల్లీలో రాష్టప్రతి కోవింద్‌ను కలుసుకున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు