జాతీయ వార్తలు

మళ్లీ బోఫోర్స్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాజకీయంగా అత్యంత సున్నితమైన బోఫోర్స్ కుంభకోణం కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యవహారంపై ఐరోపాలో ఉంటున్న భారతీయ సంతతి పారిశ్రామికవేత్తలు హిందుజా సోదరులపై వచ్చిన అనియోగాలను కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బిజెపి నాయకుడు అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసుకొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. దీంతో ఈ కేసును తిరగదోడినట్లయింది. ప్రస్తుతం రిటైరయిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్‌ఎస్ సోధీ 2005 మే 31న హిందుజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ చంద్‌లు, బోఫోర్స్ కంపెనీపై మోపిన అన్ని అభియోగాలను కొట్టివేయడమే కాకుండా ఈ కేసు కారణంగా ప్రభుత్వ ఖజానాకు 250 కోట్ల మేర ఖర్చయిందంటూ, కేసును దర్యాప్తు చేసిన సిబిఐని తీవ్రంగా తప్పుబట్టారు. కాగా,12 ఏళ్ల క్రితం నాటి ఈ కేసును సత్వరం విచారించాలని కోరుతూ దాఖలయిన మధ్యంతర పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖన్వలికర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ఈ ఏడాది అక్టోబర్ 30నుంచి ప్రారంభయ్యే వారంలో విచారణకు ఈ కేసును లిస్టింగ్ చేయనున్నట్లు తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పును నిర్ణీత 90 రోజుల గడువులోగా సిబిఐ సవాలు చేయకపోవడంతో అగర్వాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2015 అక్టోబర్ 18న సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి ముడుపులు అందాయని స్వీడన్‌కు చెందిన ప్రధాన దర్యాప్తు అధికారి స్టెన్ లిండ్‌స్ట్రామ్ తన నివేదికలో పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చిన దృష్ట్యా ఈ కుంభకోణంపై దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని పార్లమెంటులో అధికార బిజెపి ఎంపీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బోఫోర్స్ ముడుపులపై దర్యాప్తు జరపాలని కోరుతూ తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసిన విషయాన్ని సైతం అగర్వాల్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా అగర్వాల్ పోటీ చేసిన విషయం తెలిసిందే.