జాతీయ వార్తలు

జర్నలిస్టులకు రక్షణ కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఇద్దరు జర్నలిస్టుల హత్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, వారిపై జరిగే దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల కేసుల్లో 96 శాతం కేసులు కొలిక్కిరావడం లేదని పిసిఐ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) చంద్రవౌళి కుమార్ ప్రసాద్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో గత నాలుగు నెలల్లో ముగ్గురు జర్నలిస్టులు హత్యకు గురికావడం, మరో జర్నలిస్టు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. పిసిఐ జర్నలిస్టుల రక్షణకు నియమించిన సబ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు పాత్రికేయులపై దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వేగంగా విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సంవత్సరం తొమ్మిది మంది జర్నలిస్టులు, ఈ సంవత్సరం ఇప్పటికే ముగ్గురు జర్నలిస్టులు దారుణ హత్యకు గురయ్యారని తెలుపుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవడం విచారకరమని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో ముగ్గురు
సివాన్ (బిహార్): సీనియర్ జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజన్ హత్య కేసులో పోలీసులు శనివారం విచారణ నిమిత్తం ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. హిందీ వార్తాపత్రిక ‘హిందుస్తాన్’ సివాన్ జిల్లా బ్యూరో చీఫ్ అయిన రాజ్‌దేవ్ రాసిన వార్తా కథనాలు ఈ ముగ్గురు నేరస్థులను చికాకు పరిచాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ కుమార్ సాహా ఒక వార్తాసంస్థకు చెప్పారు. హత్యకు సంబంధించిన క్లూలను సేకరించడానికి సిసిటివి ఫుటేజీలను, జర్నలిస్టు మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేస్తున్నామని ఆయన వివరించారు.

chitram చంద్రవౌళి కుమార్ ప్రసాద్