జాతీయ వార్తలు

మూడు రాష్ట్రాల్లో ప్రచారానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/తిరువనంతపురం, మే 14: ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. దీంతో అయిదు రాష్ట్రాల్లో దాదాపు రెండు నెలలపాటు సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్లయింది. కేరళలో అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది.
బిజెపికి సంబంధించినంతవరకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠకు సంబంధించిన పోరుగా నిలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ఖాతా కూడా తెరవని ఆ పార్టీ ఎలాగైనా తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపి పలు సభల్లో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో మాటల యుద్ధానికి సైతం తెరతీశారు. 140 స్థానాలున్న అసెంబ్లీలో స్థానంకోసం 109 మంది మహిళలుసహా 1203 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 2.61 కోట్ల మంది ఓటర్లు వారి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు.
ప్రచారం చివరి దశలో పలువురు జాతీయ నాయకులు తమ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. మొదట్లో సోలార్ కుంభకోణం, బార్ల ముడుపుల కుంభకోణంలాంటి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రచారం మొదలైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ కేరళను సోమాలియాతో పోల్చి వివాదానికి తెరతీయడంతో అది కొత్త మలుపుతిరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితర జాతీయ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి ఈసారి రాష్ట్రంలో బలమైన వెనుకబడిన ఎజావ కులానికి చెందిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఏర్పాటు చేసిన కొత్త పార్టీ భారత్ ధర్మ జనసేనతో కలిసి పోటీ చేస్తోంది.
తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె- కాంగ్రెస్, పిడబ్ల్యుఎఫ్, డిఎండికె-టిఎంసి కూటమి, బిజెపి నేతృత్వంలోని కూటమి, పిఎంకెల మధ్య బహుముఖ పోటీ జరుగుతోంది. 234 అసెంబ్లీ స్థానాల్లోని 5.79 కోట్లకు పైగా ఉన్న ఓటర్లు నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు- జయలలిత, ఎం కరుణానిధి, విజయకాంత్, అన్బుమణి రాందాస్ సహా 3,776 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో జయలలిత రెండోసారి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. డిఎంకె, బిజెపిసహా ప్రతిపక్షాలన్నీ కూడా మద్యపాన నిషేధం, అవినీతి లాంటి అంశాలపై ప్రభుత్వంపై విమర్శలకు పదునుపెడితే, జయలలిత మాత్రం అయిదేళ్ల ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓట్లు అడుగుతున్నారు. ఇలావుండగా, ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను డిఎంకె, అన్నా డిఎంకె అధిష్ఠానాలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి 300 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుండగా 9.43 లక్షల మంది ఓటర్లున్నారు. గత మార్చి 8న పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ప్రకటించిన ఎన్నికల ప్రక్రియ ఈ నెల 19న ఫలితాల వెల్లడితో ముగుస్తుంది. కాగా తమిళనాడులోని అరవకురిచి నియోజకవర్గంలో ఎన్నికలను మే 16నుంచి 23కు వాయదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

chitram తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా శనివారం చెన్నైలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న బిఎస్‌ఎఫ్ జవాన్లు.