జాతీయ వార్తలు

800 ఇంజనీరింగ్ కాలేజీల బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 2: ఇంజనీరింగ్ చదువులకు డిమాండ్ తగ్గిపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో తప్పించి మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో నామమాత్రంగానే విద్యార్థులు ఉంటున్నారు. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే దాదాపు 800 ఇంజనీరింగ్ కళాశాలలను మూసివేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటిఇ) నిర్ణయించింది. ఈ కాలేజిల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, వౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం లాంటి కారణాలతో వాటిని మూసివేయాలని ఏఐసిటిఐ నిర్ణయించింది. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజిల పరిస్థితులను నిశితంగా గమనించిన తర్వాత ఏఐసిటిఇ సంబంధిత అధికారులను సెప్టెంబర్ మధ్య నాటికి ఒక నివేదికను సమర్పించాలని కోరింది. ఈ నివేదిక అందిన తర్వాత గత అయిదేళ్ల కాలంలో 30 శాతంకన్నా తక్కువ అడ్మిషన్లు ఉండే
కాలేజిలు మూతపడ్డమో, లేదా దగ్గర్లోని మరో కాలేజిలో విలీనం కావడమో చేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా దాదాపు 10,361 ఇంజనీరింగ్ కాలేజిలున్నాయి. మహారాష్టల్రో అత్యధిక సంఖ్యలో ఉండగా, ఆ తర్వాత తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. కాగా, విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి కొన్ని కాలేజిలు కౌన్సిల్‌ను ఒక ఏడాది సమయం కోరినట్లు తెలుస్తోంది. అయితే కౌన్సిల్ అందుకు అనుమతిస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఇక మరో వైపు ఇంజనీరింగ్ కాలేజిల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఇంజనీరింగ్ కాలేజిల్లో పని చేసే అధ్యాపకులకోసం ఏఐసిటిఇ ఆరునెలల టీచర్స్ ట్రైనింగ్ కోర్సును కూడా ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. అంతేకాకుండా రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనసరి కూడా చేసింది.