జాతీయ వార్తలు

మరింత పటిష్ఠం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: చైనాలో జరుగనున్న బ్రిగ్స్ శిఖరాగ్ర సదస్సులో ఉత్పాదక చర్చలు, సానుకూల ఫలితాలు సాధ్యం కాగలవన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ శాంతి భద్రతలను పరిరక్షించడంలోనూ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ చైనా సారథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు విజయవంతం కాగలదన్న నమ్మకాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఆదివారం ఐదు దేశాల బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు చైనా వెళుతున్న సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. గోవా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను, చేపట్టిన కార్యక్రమాలను చైనా సదస్సు మరింత ముందుకు తీసుకెళ్లగలదనే భావిస్తున్నట్టు తెలిపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చైనాలోని జియామెన్‌లో జరుగనుంది. జియామెన్ నుంచి మైన్మార్ వెళ్లే మోదీ అక్కడ మూడు రోజుల పాటు పర్యటిస్తారు. భద్రత, ఉగ్రవాద నిరోధన, వ్యాపార, వాణిజ్య అంశాలపై మరింతగా సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై మైన్మార్ నాయకత్వంతో చర్చిస్తామన్నారు.